బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ చేరిక.
బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ చేరిక.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ అధినేత కేసీఆర్‌కు వరస షాకులిస్తున్నారు.
ఈ క్రమంలోనే శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ నేతలు, సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Post a Comment