Food : బిస్కెట్ పాకెట్ లో పురుగులు. తింటే నరకానికి గేట్ పాస్*
బిస్కెట్ పాకెట్ లో పురుగులు. తింటే నరకానికి గేట్ పాస్*
కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఓ షాపులో హైడెన్సీ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. అయితే బిస్కెట్ ప్యాకెట్ తిందామని ఓపెన్ చేసి చూడగా.. అందులో తెల్ల పురుగులు అతనికంట పడ్డాయి. పిల్లల కోసం తీసుకున్న ఆ బిస్కెట్ ప్యాకెట్లు పురుగులు ఉండడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు.
దాంతో అతను ఆ విషయాన్ని షాప్ యజమానికి తెలియజేస్తే లోపల ఉన్న వాటికి సంబంధించిన విషయం తనకు తెలియదని తెలిపారు. ఈ విషయాన్ని కాస్త ఆ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
కాబట్టి ఏదైనా వస్తువు కొన్నప్పుడు వాటిని వాడే క్రమంలో అది పరిశుభ్రంగా ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తింటే ఇలాంటి వాటి నుండి తప్పించుకోవచ్చు. బిస్కెట్ ప్యాకెట్ లో వచ్చిన పురుగులను చూసి కొందరు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
బిస్కెట్ ప్యాకెట్ తో పాటు రోగాలు కూడా ఫ్రీ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరైతే ఇలాంటి బిస్కెట్లను తింటే నేరుగా నరకానికి గేట్ పాస్ తీసుకున్నట్లే అంటూ కామెంట్ చేస్తున్నారు.

Post a Comment