-->

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జితేష్ వి. పాటిల్ ఐఏఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జితేష్  వి. పాటిల్  ఐఏఎస్


 ఆదివారం జిల్లా కలెక్టర్ గా ఉదయం 10 :15 నిమిషాలకు ఐ డి ఓ సి లో తన ఛాంబర్ లో తొలి సంతకం చేసి నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలను జితేష్  వి. పాటిల్  స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మరియు అన్ని శాఖల జిల్లా అధికారులు పుష్పగుచ్చం అందించి కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో  జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ గా పని చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాల మేరకు అందరినీ సమన్వయం చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పారు.

 ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793