ఇరువర్గాల ఘర్షణలో అమాయకులకు నష్టం ఐజీ రంగనాథ్..
మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్లలో ఇరు వర్గాలలో ఒక వైపు 23 మంది, మారో వైపు 22 మంది పై కేసు నమోదు చేసినట్లు మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ వెల్లడించారు.
ఇందులో ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఎవరిని వదిలి పెట్టమన్నారు. దాడి ఘటనపై స్పెషల్గా టీమ్స్ పెట్టి తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. మెదక్ పట్టణంలో ఆదివారం సాయంత్రం జరిగే నల్ల పోచమ్మ బండ్ల ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఇరు వర్గాల నుంచి ఘర్షణకు కారకులైన వారిలో 45 మందిని గుర్తించామని,
9 మంది హిందువుల పై కేసు నమోదు చేశామని, మూడు కేసులు రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. శనివారం జరిగిన ఘర్షణలో హిందూ లీడర్లు రాకూడదన్నారు. పోలీసులు స్పందించకపోతే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.య సీసీ కెమెరాలు నిశితంగా పరిశీలించి కేసులు బుక్ చేస్తా చేస్తామని, దాడిలో ఎవరి పక్షం వైపు ఉండేది లేదని, కేసులు నిష్పక్షపాతంగా పెడుతున్నట్టు చెప్పారు. సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా సహనం పాటించాలని కోరారు.
సోషల్ మీడియాలో అనవసరమైన వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు. కేసులు నమోదు లో రాజకీయ ఒత్తిలు లేవన్నారు. చెక్ పోస్టుల వద్ద అక్రమంగా తరలిస్తున్న వందల ఆవులను పట్టుకుంటున్నామన్నారు. ఛతీస్ గడ్, ఒరిస్సా నుంచి వచ్చిన ఆవులు పట్టుకుని వారిపైన కేసు నమోదు చేసి గోశాలకు పంపుతున్నామన్నారు. సొంతంగా ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు.. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 34,149 గుంపులు ఉంటే బాధ్యులు అవుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ బాల స్వామి పాల్గొన్నారు.

Post a Comment