రేపు హైదరాబాద్ జిల్లా లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ వాహనదారుల కు,రేపు కీలక గమనిక… రేపు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు.
రేపు ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. నగరంలోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు వివిధ ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రార్థనలు జరిగే పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్ళి ఇస్తామన్నారు..
సోమవారం బక్రీద్ సందర్భం గా హైదరాబాద్‌లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిం చనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే మీరాలం ఈద్ పరిసర ప్రాంతాల్లో వాహనా లను దారి మళ్లిస్తామని పోలీసులు వివరించారు.
పాతబస్తీలోని పలు రహదా రులపై రాకపోకలు నిలిపివే స్తున్నట్లు, పోలీసులు తెలుపగా..పురానాపూల్, కమాటిపురా మరియు కిషన్‌బాగ్ వైపు నుండి ఈద్గా ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే బహదూర్ పురా క్రాస్ రోడ్ మీదుగా ఉదయం 8:00 నుండి 11:30 వరకు అనుమతి స్తామని పోలీసులు తెలిపారు.
ప్రార్థనలకు వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం కోసం జూ పార్క్, మసీదు అల్హా హో అక్బర్ ముందు ఏర్పా ట్లు చేసినట్లు వివరించారు. సోమవారం జూన్ 17,న ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
సోమవారం పాత బస్తీలో సుమారు 1000 మంది పోలీసులను మోహరి స్తున్నట్లు వారు తెలిపారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న మీరాలం ఈద్ సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయనున్నారు.
ఇంకా, ఈ ప్రార్థనలకు 30,000 మందికి పైగా ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు..

Post a Comment