గనుల వేలంలో సింగరేణి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనకూడదు
* గనుల వేలంలో సింగరేణి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనకూడ
* సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సంయుక్త ప్రకటన
మైనింగ్ సెక్టార్ లోని గనుల వేలంలో సింగరేణి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, గనుల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొంటుందని ప్రకటించడాన్ని వ్యతిరేకించండి. రియాజ్ అహ్మద్ ప్రధాన కార్యదర్శి HMS, ఐ కృష్ణ TGLBKS-IFTU. ప్రధాన కార్యదర్శి, నేరటి రాజన్న TSUS G. రాములు AIFTU అధ్యక్షులు.
గోదావరిఖని హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సింగరేణి సింగరేణి సంస్థని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ వేళలో పాల్గొనకూడదని ఐక్య వేదిక సంఘాల భేటీలో కార్మిక సంఘాలు తమ నిరసనను తెలియజేశాయి తేదీ 21/6/24న సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుందని ఈ సమావేశంలో కార్మిక సంఘాలు సింగరేణిలో కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలు నాలుగు బొగ్గు బ్లాక్ ల వేలంలో నాటి ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వేలంలో పాల్గొంటామని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గంతో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం తీసుకోబోతున్నామని ఐక్య కార్మిక సంఘాల వేదిక కన్వీనర్ రియాజ్ అహ్మద్, తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (IFTU) ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, TSUS రాష్ట్ర నాయకులు నేరటి రాజన్న, ఏ ఐ ఎఫ్ టి యు అధ్యక్షులు జి రాములు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆక్షేపించారు.
తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గుజరాత్ రాష్ట్రంలో ఏ విధానమైతే అమలు జరుగుతుందో తెలంగాణలో కూడా అదే జరగాలని దానికి కావలసిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం మైనింగ్ పాలసీ తీసుకువచ్చి గనులను ప్రైవేటుకరించి కార్పొరేట్ శక్తులకు కేంద్రంలోని ఎన్డీఏ బిజెపి ప్రభుత్వాలు అప్పజెప్పడాన్ని 10 సంవత్సరాల నుండి చూస్తున్నామన్నారు. దేశంలోని సహజ వనరులు దేశ సంపదను ప్రజలకు చెందకుండా నూతన మైనింగ్ పాలసీ తీసుకువచ్చి వేలం ద్వారా కట్టబెడుతున్నారనీ అన్నారు.
మన రాష్ట్రంలో 2015 లో మినరల్ బ్లాకుల వేలం ప్రక్రియ అమల్లోకి వచ్చింది. అప్పటినుండి దేశవ్యాప్తంగా 354. మినరల్ మేజర్ బ్లాకులను వేలం వేశారనారు. గడచిన తొమ్మిదేళ్లలో ఏ ఒక్క గనిని వేలం వేయలేదని ఈ ప్రక్రియలో రాష్ట్రం విఫలమైతే తామే వేలం చేపడతామని కేంద్రం రాష్ట్రాన్ని హెచ్చరిస్తుందనీ అన్నారు. ఇప్పటికే కోల్ ఇండియాలో అనేక బ్లాకులను సింగరేణిలో నాలుగు బ్లాకులను వేలంలోకి తీసుక వచ్చారనీ అన్నారు.
ఈ ప్రైవేటీకరణను కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేలం ప్రభుత్వం వేలం విధానాన్ని వ్యతిరేకించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో కలిసి తిప్పి కొట్టాలని కోరుతున్నాం. సింగరేణిలోని కార్మిక సంఘాలు ఇతర మైనింగ్ సెక్టార్లలో కార్మికులు కార్మిక సంఘాలు ఉద్యమబాట పట్టాలని కేంద్రానికి సరైన సమాధానం చెప్పాలని పిలుపునిస్తున్నాం.

Post a Comment