కొత్తగూడెం,పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్
*కొత్తగూడెం,పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్*
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూనంనేని భేటి.....
* కొత్తగూడెం నియోజకవర్గ సమస్యలపై సుదీర్ఘ చర్చ*
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీఅయ్యారు. రాష్ట్ర సచివాలయంలో గంటపాటు జరిగిన చర్చలో కొత్తగూడెం నియోజకవర్గానికి సంబందించిన ప్రధాన సమస్యలను కూనంనేని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కూనంనేని ప్రతిపాదించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందింస్తూ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలనే కూనంనేని ప్రతిపాదనను ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు.
ఇందుకు సంబందించిన ప్రక్రియను త్వరలో చేపడతామని సీఎం తెలిపినట్లు కూనంనేని తెలిపారు. అదేవిధంగా కేటీపీఎస్ తొలిగంచబడిన విద్యుత్ స్టేషన్ల స్థలంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు కూనంనేని తెలిపారు. జిల్లా రైతాంగ సాగునీరు అవసరాలు తీర్చేందుకు సీతారామ ప్రాజెక్టు డిజైన్ మార్చేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారని,

Post a Comment