-->

రోడ్డేయ్యాలని బురదలో కూర్చొని నిరసన*

రోడ్డేయ్యాలని బురదలో కూర్చొని నిరసన*

 *రోడ్డేయ్యాలని బురదలో కూర్చొని నిరసన* 

 ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మల్లేలమడుగు 60వ డివిజన్ రామన్నపేట డబుల్ బెడ్ రూమ్లకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు బురదలో రహదారిపై బైఠాయించి నిరసనను తెలియజేశారు.

వెంటనే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బోడ వీరన్న మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించి రోడ్డు నిర్మాణాన్ని మర్చిపోయారని విమర్శించారు. 

రోడ్డు లేకపోవడం వలన మురుగు నీటిలో నివాసం ఉండాల్సివస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేయాలని ఆయన కోరారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793