-->

మరణించిన కార్మికుల వారసులకు కారుణ్య నియామక పత్రాల అందజేత

  


మెడికల్ ఇఎన్వాలిడేషన్/ మరణించిన  కార్మికుల వారసులకు కారుణ్య నియామక పత్రాల అందజేత 

సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పని చేస్తూ మెడికల్ ఇఎన్వాలిడేట్/ మరణించిన  కార్మికుల   అర్హత కలిగిన డిపెండెంట్లకు కారుణ్య నియామకాల కొరకు ధరఖాస్తు చేసుకున్న కార్మికుల పిల్లలకు తేదీ:24.06.2024న కొత్తగూడెం ఏరియా  జిఎం ఎం.షాలేం రాజు గారు కారుణ్య నియామక పత్రాల అందజేయడం జరిగింది. 

ఈ సందర్భంగా జిఎం  గారు మన సంస్ధ సి&ఎండి గారి ఆదేశాల మేరకు 2018 సంవత్సరము నుండి కారుణ్య నియామకాలను జరుగుతున్నవి ప్రస్తుతం ఈ నెలలో "18" మందికి కారుణ్య నియామకాల పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. వారికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన ఈ అవకాశాన్ని శ్రద్ధగా క్రమశిక్షణతో నాగాలు లేకుండా పని చేసి సంస్థ అభివృద్దికి  పాటుపడాలని రానున్న రానున్న కాలంలో విద్యార్థులకు తగిన స్థాయిలో ఉద్యోగాలను పొందాలని ఆకాంక్షించారు.

 కారుణ్య నియామక ప్రక్రియ ప్రారంభం అయిన అప్పటి నుండి  ఈరోజు వరకు కొత్తగూడెం ఏరియాలో 565 మందికి కారుణ్య నియామక పత్రాలు అందచేశామని  వారు కంపనిలో బదిలీ వర్కర్ లాగ నియమకాము అయ్యి  కంపనీ నిర్వహించిన అంతర్గత పరీక్షలలో అర్హత సాధించిన వారు ప్రమోషన్ పొంది వివిధ పోస్టులలో పని చేస్తున్నారని అన్నారు మరీ ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగమును పొందిన వారసులు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞులై ఉండాలన్నారు.  

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జిఎం ఎం.షాలెం రాజు, ఎస్ ఓ టు జిఎం జి.వి.కోటిరెడ్డి,   సీనియర్  పిఓ ఎం. మురళి, గుర్తింపు సంఘం ఏఐటియుసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ కె.రాములు, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, జూనియర్ అసిస్టెంట్  కే.అరవింద్, సింగరేణి కోఆర్డినేటర్ సాగర్ పాల్గొన్నారు. 

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793