కలెక్టరేట్ కార్యాలయంపై ఎక్కి ఆత్మహత్యాయత్నం ఉలిక్కిపడ్డ ప్రాంగణం
కలెక్టరేట్ కార్యాలయంపై ఎక్కి ఆత్మహత్యాయత్నం ఉలిక్కిపడ్డ ప్రాంగణం
జనగామ కలెక్టర్ సముదాయంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జనగామ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు అనేయువకుడి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
బాధితుడు నిమ్మల నర్సింగరావు , పసరమడ్ల గ్రామం, జనగామ మండలం. నిమ్మల లక్ష్మయ్య , పసరమడ్ల గ్రామం, జనగామ మండలం.పై ఇద్దరికి వంశపారంపర్యంగా, నర్సింగరావు (7.29 గుంటలు) మరియు లక్ష్మయ్య కు(7.20 గుంటల) భూమి గలదు. నర్సింగరావు బతుకుదెరువు కోసం ములుగు జిల్లాలో పని చేస్తూ జీవిస్తున్నాడు. లక్షయ్య, సిరిపురం గ్రామం, లింగాల ఘనపూర్ మండలంకి ఇల్లారికం వెళ్ళాడు.
వీరిద్దరికి చెందిన భూమి వీరు పాలోళ్లు అయిన,1) నిమ్మల యాదగిరి., 2) నిమ్మల నర్సయ్య., 3) నిమ్మల ఎల్లయ్య, 4) నిమ్మల పాండు 2009 లో కొంత భూమి మరియు 2016-17 లో మిగిలిన భూమి అక్రమంగా తాము బతికి ఉన్నప్పటికీ చనిపోయారంటూ తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీరి వాదన పై గతంలో పలు సార్లు తహసీల్దార్ మరియు కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లిన ఎవరు పట్టించుకోలేదు అని ఈ రోజు కూడా జనగామ కలెక్టర్ కి గ్రీవిన్స్ సెల్ లో దరఖాస్తు ఇవ్వగా, కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వారు లేనందున భూ సమస్య పరిష్కారం కావడం లేదు అని పిటిషన్ తీసుకోలేదు, అందుకు గాను మదన పడ్డ బాధితుడు జనగామ కలెక్టరేట్ పైన బ్యానర్ కట్టి, పురుగుల మందు త్రాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా, పోలీసులు పైకి ఎక్కి పట్టుకొని క్రిందికి దించి హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు..
ఈ విషయంలో 2021 డిసెంబర్ 20 రోజున జనగామ పాత కలెక్టరేట్ ముందు డీజిల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అలాగే 2022 సెప్టెంబర్ 19 రోజున జనగామ నూతన కలెక్టరేట్ ముందు డీజిల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.

Post a Comment