ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య
ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య
ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపంతో మైనర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలోని తంగేళ్లపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన తొక రవి-లక్ష్మీ దంపతుల కుమార్తె మండలంలోని పద్మ నగర్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది.
కాగా సోమవారం వెలువడిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి రవి బీడీ కంపెనీలో పనిచేయగా, తల్లి లక్ష్మి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది.
కన్న కూతురు ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

Post a Comment