-->

ఉండవేల్లి మండల కేంద్రంలో దారుణ హత్య

ఉండవేల్లి మండల కేంద్రంలో దారుణ హత్య


 గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. సంబంధిత వివరాల ప్రకారం కర్నూల్‌కు చెందిన దేవేందర్ కు ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన మహేశ్వరి తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. గొడవల కారణంగా మహేశ్వరి తల్లి గారి దగ్గర పుట్టింట్లో ఉంది. 

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఉండవల్లిలోనే అత్తగారింటికి దేవేందర్ రాగా గొడవ జరిగి హత్యకు దారితీసినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి కేసు నమోదు చేసుకొని చేరుకొని క్లూస్ టీమ్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793