-->

మెదక్ పట్టణంలో కొనసాగుతున్న బంద్ భారీగా మోహరించిన పోలీసులు

 

మెదక్ పట్టణంలో కొనసాగుతున్న బంద్ భారీగా మోహరించిన పోలీసులు

బక్రీద్ సందర్భంగా ఓ వర్గానికి చెందిన వారు గోవులను తరలిస్తుండగా బీజేవైఎం నాయకులు అడ్డుకోవడంతో మెదక్ పట్టణంలో అల్లర్లు చెలరేగాయి.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఓ వర్గం వారు తమ పై కత్తులతో దాడి చేయడంతో హిందూ సంఘాలు, బీజేవైఎం కార్యకర్తలు నేడు మెదక్ పట్టణం బందుకు పిలుపునిచ్చారు. దీంతో నగరంలోని ప్రధాన కూడాల్లు, మార్కెట్లలోని వ్యాపార సముదాయాలను స్వచ్చందంగా మూసివేసి దాడులకు నిరసన తెలుపుతున్నారు. 

కాగా మరోసారి ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా పక్క జిల్లాలకు చెందిన పోలీసులను రప్పించి మెదక్ పట్టణంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే మెదక్ పట్టణ కూడల్లు నిర్మానుష్యంగా, ఎటు చూసిన పోలీసుల పహారాతో కనిపిస్తున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793