కామాంధునికీ బలైన బేబీ సహస్ర కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు
పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఆరేళ్ల బాలిక రేప్ కేసులో నిందితుడికి చట్ట పరంగా శిక్ష పడుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఆదివారం మంత్రి సీతక్క, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలతోపాటు మంత్రి శ్రీధర్ బాబు బాధిత కుటుం బాన్ని పరామార్శించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమ న్నారు. హత్యాచార ఘటన తనను కలిచివేసిందని తెలిపారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని చెప్పారు.
నిందితుడిని ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, శ్రీధర్ బాబు ఈ సందర్భంగా అన్నారు.

Post a Comment