వరంగల్ పోలీసులు ముందు మావోయిస్టు దంపతుల లొంగుబాటు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ముందు మావోయిస్టు దంపతులు లొంగిపోయినట్లు వరంగల్ పోలీసు కమిషనరేట్ ఇన్-ఛార్జ్ కమిషనర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మావోయిస్టు దంపతుల లొంగుబాటు వివరాలను వెల్లడించారు.
హన్మకొండ జిల్లా హాసన్ పర్తి మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుశ్మిత 27 ఇంటర్మీడియేట్ వరకు చదువుకుంది. తన తండ్రి అయినా తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతిపరుడుగా పనిచేశాడని,అతన్ని చూసి ఆకర్షితురాలైన సుష్మిత తన చదువు అనంతరం 2016 వ సంవత్సరంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి గ్రామ అటవీప్రాంతంలో బడే చొక్కారావు @ దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరింది.
ఛత్తీస్ గడ్ రాష్ట్రం సుకుమా జిల్లా , పరియా గ్రామానికి చెందిన మడకం దూల @ దూల ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. తన అన్నయ్య అయినా ఐయేత 2008 సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరాడని, అతన్ని చూసి ఆకర్షితుడైన దూల 2015 వ సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ అయిన జోగి ప్రోత్సాహంతో సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరాడు.లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబెర్ మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇంచార్జి వద్ద సుష్మిత సెంట్రల్ కమిటీ స్టాఫ్ గా, దూల ప్రొటెక్షన్ టీం మెంబర్ గా పనిచేశారని తెలిపారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి 2020 మార్చి నెలలో 30 వ తేదీన వివాహం చేసుకున్నారు. తరువాత వివిధ హోదాల్లో పలు చోట్ల పనిచేసారు. మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి,
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం గురించి తెలుసుకుని ఆకర్షితులైన వీరిరువురు ఈ రోజు వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. వీరిరువురికి ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు నగదు రివార్డ్ వున్నదని ఆ మొత్తాన్ని ఈరోజు సీపీ చేతుల మీదుగా బ్యాంకు డీడీ రూపంలో వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాజిపేట ఏసీపీ పి.తిరుమల్, హాసనపర్తి ఇన్స్పెక్టర్ జె.సురేష్ పాల్గొన్నారు.

Post a Comment