-->

సుల్తానాబాద్ అత్యాచార ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ డీజీపీకి కీలక ఆదేశాలు

సుల్తానాబాద్ అత్యాచార ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ డీజీపీకి కీలక ఆదేశాలు


నారాయణ పేట, పెద్దపల్లి జిల్లాల్లో జరిగిన హత్యాచారం, భూతగాదా హత్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్యపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. నారాయణ పేట జిల్లాలో సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై సీఎం ఆరా తీశారు. అరచకాలు, హత్యలకు పాల్పడే వారెవరైనా ఉపేక్షించవద్దని సీఎం రేవంత్ అన్నారు. 

నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793