సింగరేణిలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం TBGKS
సింగరేణిలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం TBGKS
BJP పార్టీ మరియు కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ద్వంద వైఖరిని అవలంబిస్తున్నాయి దొంగలు ఊర్లు పంచుకున్నట్టు సింగరేణి పంచుకోవడానికి ఎత్తుగడలు వేస్తున్నారు కెసిఆర్ గారు సీఎంగా ఉన్న రోజుల్లో అనేక ఉద్యమాలు చేసి కోయగూడె OC శ్రావణ పల్లె ఓసి సత్తుపల్లి ఓసి కళ్యాణి గని ఈ నాలుగు బ్లాకులను అడ్డుకోవడం జరిగింది సత్తుపల్లి ఓసి త్రీ నీ అమంత కంపెనీ కోయగూడెం ఓసి అరబిందో కంపెనీలు దక్కించుకోవడం జరిగింది.
ఆ రోజుల్లో టీబీజీకేఎస్ ఒత్తిడి, రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఒత్తిడి వల్ల పనులు మొదలు కాకుండా అడ్డుకోవడం జరిగింది. ఆ కంపెనీలు బ్లాక్ ను వదిలివేయడం జరిగింది. ఆ బ్లాక్స్ ని సీఎం కేసీఆర్ గారు సింగరేణికి కేటాయించాలని కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బిజెపి వచ్చిన తర్వాత టెండర్లు పిలవడం జరిగింది. ఈ చర్యను ఖండిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భవిష్యత్తులో అన్ని సంఘాలని కలుపుకుని సింగరేణిలో ప్రణాళికాబద్ధంగా పోరాటం చేస్తామని తెలిపారు.
గెలిచిన ఏఐటీయుసీ ప్రాతినిధ్యంగా నిర్వహిస్తున్న ఐఎన్ టియుసి ఈ రెండు సంఘాలు నిమ్మకు నీరెత్తినట్టు కార్మికుల పక్షాన నిలుబడి పోరాటం చేయకుండా ఉండడం దురదృష్టకరమని ఇకనైనా ఈ సంఘాలు స్పందించి కార్మికుల పట్ల సమస్త పట్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది.
ఈ కార్యక్రమంలో TBGKS జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ, రీజనల్ సెక్రెటరీ కూసాని వీరభద్రం, కార్పొరేట్ ఇంచార్జి తుమ్మ శీను, కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ గడప రాజయ్య, కిరణ్, విజయ్ కుమార్, M సూర్యనారాయణ, అహరోస్, గణేష్, బూర్గుల రవి, తిరుపతి, సూరజ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment