సింగరేణి వకీల్ పల్లి గనిలో వెల్డర్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి
సింగరేణి వకీల్ పల్లి గనిలో వెల్డర్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి
*కాంట్రాక్టు కార్మికుడు జనగామ శర్మ మరణానికి సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాలి*
*శర్మ కుటుంబానికి నష్టపరిహారం 50.లక్షల రూపాయలు ఎక్స్ గ్రెషీయా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.*
*IFTU జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ నరేష్ ,బి అశోక్*
నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో సింగరేణి వకీల్ పల్లి గనిలో వెల్డర్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన జనగామ శర్మ అనే సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు మరణించాడు
సింగరేణి ఏరియా హాస్పిటల్ లో మృతదేహాం వద్ద ఆందోళన లో IFTU జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ నరేష్, బి అశోక్ లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల మరణాల పట్ల సింగరేణి యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని అన్నారు.
ఎలాంటి రక్షణ చర్యల చేపట్టకపోవడం మూలంగా జనగామ శర్మ అనే వెల్డర్ కార్మికుడు యాజమాన్యం తప్పిదం వల్లనే మరణించాడు. 7 ఎల్ఈపీ గనిలో మాస్టర్ల బేస్ లో టెండర్ పొంది వకీల్ పల్లి గనిలో వెల్డర్ పనులు నిర్వహించడం టెండర్ నిబంధనలకు విరుద్ధం.
అది కూడా కేవలం ఫస్ట్ షిఫ్ట్ పనులకు మాత్రమే అనుమతులు పొంది రాత్రి 9 గంటల దాకా అధిక పని చేయడంతో ప్రమాదానికి గురికావడం జరిగింది. సింగరేణి యాజమాన్యం దీన్ని నార్మల్ డెత్ గా చిత్రకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చెపిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలని
జరిగిన ప్రమాదం పై వెంటనే విచారణ జరిపించాలని బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐ ఎఫ్ టీ యు గా డిమాండ్ చేస్తున్నాం. జనగామ శర్మ అనే కార్మికుడి కుటుంబానికి ఉద్యోగంతో పాటు, 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషీయా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

Post a Comment