ఎంజీఎం ఆస్పత్రిలో నాలుగు రోజుల పసిగుడ్డును పిక్కుతిన్న కుక్కలు
ఎంజీఎం ఆస్పత్రిలో నాలుగు రోజుల పసిగుడ్డును పిక్కుతిన్న కుక్కలు
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం నవజాత శిశువును కుక్కలు ఎంజీఎం ఆస్పత్రిలోకి వచ్చి పీక్కు తింటుండడంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు రోగి బంధువులు చెదరగొట్టారు.
మృత శిశువును ఎంజీఎం మార్చూరిలో భద్రపరిచారు. ఈ శిశువు ఆడన, మగన అనేది తెలియరావడం లేదు. కుక్కలు సగం బాడిని తినడంతో గుర్తుపట్టడం కష్టంగా ఉంది. ఈశిశువును ఎక్కడినుంచి తీసుకువచ్చాయా అనే కోణంలో ఆస్పత్రి అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment