సేవాలాల్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా భూక్య సిద్దు నాయక్
సేవాలాల్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా భూక్య సిద్దు నాయక్
సేవాలాల్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా భూక్య సిద్దు నాయక్ ని నియమంచడం జరిగింది. నిన్న నర్సంపేటలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ సిద్దు నాయక్ ని నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా సంజీవ్ నాయక్ మాట్లాడుతూ దశాబ్దం పాటుగా గిరిజనుల కోసం అనేక ఉద్యమాలు చేస్తూ రాష్ట్రంలో గిరిజనులలో ఐక్యతను పెంచిన ఏకైక సంఘం సేవాలాల్ సేన అని పేర్కొన్నారు. నియామక పత్రం అందుకున్న బాద్యులందరు క్రమశిక్షణతో పని చేయాలని అన్నారు.
అధ్యక్ష నియామక పత్రం అందుకున్న సిద్దు నాయక్ తన నివమకాన్ని సహకరించిన సంజీవ్ నాయక్ సైదా నాయక్ ఉషన్ నాయక్ లంబాడి లైవ్ ఐక్యవేదిక జిల్లా కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్ కు ధన్యవాదాలు తెలిపారు. తన మీద నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని పేర్కొన్నారు.
Post a Comment