సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళాబృందం ద్వారా విద్యార్తులకు అవగాహన
సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళాబృందం ద్వారా విద్యార్తులకు అవగాహన
మహబూబాబాద్ జిల్లా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య పర్యవేక్షణలో మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఏకాశీల ఏంజెల్స్ స్కూల్స్ లో మహబూబాబాద్ తిన్ సీఐ దేవేందర్, షీ టీమ్స్ ఎస్.ఐ సునందా, మరియు సిబ్బందితో కలిసి నూతన చట్టాలు, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, సైబర్ మోసాలు, షి టీమ్స్, గుడంబ, గంజాయి నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం జరిగింది.
కార్యక్రమం భాగంగా సీఐ పెండ్యాల దేవేందర్ మాట్లాడుతూ ఈ మధ్యకాలం లో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే 1930 నంబర్ కి పిర్యాదు చేయాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని వల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోంది అని తెలిపారు, సిసి కెమెరాలు ఏర్పాటు సహకరించాలని, తల్లి తండ్రులు పిల్లలకి ఉన్నత చదువులు చదివించాలని అన్నారు.
యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని,ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు.
గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. మంత్రాలు అంటూ ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు.

Post a Comment