-->

తెలంగాణలో 4 కొత్త విమానాశ్రయాలకు కదలిక

తెలంగాణలో 4 కొత్త విమానాశ్రయాలకు కదలిక
తెలంగాణతో పాటు ఏపీలో కూడా ప్రతిపాదనలు?

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రెక్కలు విచ్చుకోనున్నాయి. ఏపీలో ఆరు, తెలంగాణలో నాలుగు కొత్త ఎయిర్‌పోర్టు ల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఏపీలోని ఆరు ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు.. ఫీజిబిలిటీ స్టడీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది. 

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు శ్రీకాకుళం, నాగార్జున సాగర్, తాడేపల్లిగూడెం, తుని, ఒంగోలులో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించా లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్రాన్ని కోరుతోంది. దీనిపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రతిపాద నలను పంపించింది. 

కేంద్రం నుండి కూడా సాను కూల స్పందన రావడంతో.. ఆయా ప్రాంతాల్లో ఎయిర్‌ పోర్టుల నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీ లించేందుకు ఫీజబులిటీ స్టడీ నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

ఇక తెలంగాణలో కూడా కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో పాటు బేగంపేట ఎయిర్‌పోర్టు మాత్రమే ఉంది. వీటికి అదనంగా రామగుండం, మామునూరు, కొత్త గూడెం అదిలాబాద్ జిల్లాలో  కొత్తగా ఎయిర్‌ పోర్టులను నిర్మించాలని భావిస్తోంది..

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. మామునూరు ఎయిర్ పోర్టుకు ఇప్పటికే ఎన్‌ఓసీ సాధించామని..దీంతో వరంగల్ ప్రజల కల నెరవేరబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 

ఈ విమానాశ్రయాన్ని 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశామ న్నారు.డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి..కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కలుస్తామ న్నారు..కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ప్రతిపాదనలో ఉన్న మిగతా నాలుగు విమానాశ్ర యాలను కూడా ఈ నాలుగేళ్లలో తప్పకుండా సాధిస్తామని స్పష్టం చేశారు. 

వరంగల్‌ జిల్లాలోని మాము నూరులో ఎయిర్‌పోర్ట్‌.. స్వాతంత్రానికి పూర్వం నుంచే ఉంది. దాదాపు 32 ఏళ్ల కిందట ఇది మూత పడింది. దీన్ని తిరిగి తెరిపించేందుకు ప్రయ త్నాలు జరిగినా అవి ఫలించలేదు. అయితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవ డంతో..మామునూరు విమానాశ్రయానికి మళ్లీ రెక్కలు రానున్నాయి. 

దీంతో విమానయానం చేయాలన్న ఓరుగల్లు వాసుల కల సాకారం కాబోతుంది. అటు వరంగల్‌ అభివృద్ధికి కూడా మాము నూరు ఎయిర్‌పోర్టు కీలకం కానుంది..

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793