విద్యుత్ ప్రమాదంలో మరణించిన వ్యక్తికి 5 లక్షల పరిహారం
విద్యుత్ ప్రమాదంలో మరణించిన వ్యక్తికి 5 లక్షల పరిహారం
*ప్రభుత్వ విప్ చేతుల మీదుగా అందజేత*
వేములవాడ పట్టణానికి చెందిన ఆడెపు గంగాధర్ 2023 జనవరిలో ఎల్ టి వైర్ తగిలి విద్యుత్ ప్రమాదానికి గురై మరణించడం జరిగింది.
మరణించిన ఆడెపు గంగాధరకు సెస్ విద్యుత్ సహకార సంస్థ నుండి 5 లక్షల రూపాయల పరిహారపు చెక్కు మంజూరు కాగా, అట్టి చెక్కును ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా గంగాధర్ భార్య ఆడెపు మాధవికి గురువారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మిరాజం, సెస్ ఏఈ సిద్ధార్థ పాల్గొన్నారు.

Post a Comment