-->

వరంగల్ జిల్లా వర్దన్నపేటలో మరోసారి దొంగల కలకలం

వరంగల్ జిల్లా వర్దన్నపేటలో మరోసారి దొంగల కలకలం

 వరంగల్ జిల్లా వర్దన్నపేటలో మరోసారి దొంగల కలకలం 

పట్టణంలోని భారతీయ టాకీస్ సమీపంలో ఉన్న రేషన్ డీలర్ చెన్న శ్రీధర్ ఇంట్లో చోరీకి విఫలయత్నం. ఇంట్లో పడుకున్న సమయంలో అర్ధరాత్రి రెండు గంటలకు డోర్లు తీసి లోపలికి వెళ్లిన దుండగులు.

మహిళ మెడలో నుండి బంగారు గొలుసును తీస్తుండగా మహిళకు మేలుక రావడంతో పరారైన దొంగలు. చాకచక్యంగా ఓ దొంగను పట్టుకున్న ఇంటి యజమాని, అనంతరం మరో దొంగ ఘటనా స్థలానికి వచ్చి సరెండర్. దొంగతనం జరిగిన సమయంలో వెంటనే 100 డయల్ కు కాల్ చేసిన బాధితులు. ఎంతకూరాని పోలీసులు..

దొంగలకు స్థానికులు దేహశుద్ధి చేయడంతో వివరాలు తెలిపినట్లు సమాచారం. దీంతో వర్ధన్నపేటకు చెందిన వ్యక్తులకు బంధువులుగా చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేయని పోలీసులు. ఫోన్లోనే కేసు పెడతారా సెటిల్ చేసుకుంటారా అంటూ ప్రశ్నలు. పోలీసుల తీరు పట్ల విస్తుపోతున్న పట్టణవాసులు. 

వరంగల్ జిల్లా వర్దన్నపేటలో గత కొంతకాలంగా దొంగల భయం వెంటాడుతుంది. ఈ మధ్యకాలంలో గుర్తు తెలియని వ్యక్తులు పట్టణ శివారులో ఆలయాలపై పలు డబ్బాలపై దొంగతనానికి పాల్పడుతూ దొరికినంత నగదును సామాగ్రిని విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ఇప్పుడు ఏకంగా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వర్ధన్నపేట భారతీయ టాకీస్ సమీపంలో ఉన్న రేషన్ డీలర్ చెన్న శ్రీధర్ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా చొరబడ్డారు.

 దీపావళి పండుగ సందర్భంగా దాదాపు వారి కుటుంబ సభ్యులు పదిమందికి పైగా ఇంట్లోనే బస చేస్తున్న సమయంలో చెప్పులు బయట విప్పి మెష్ డోర్లను చాకచక్యంగా తీసి లోపలికి చొరబడ్డారు. అక్కడే ఇంట్లో హాల్లో పడుకున్న మహిళ మెడలోని పుస్తెలతాడును నెమ్మదిగా తీస్తుండగా మేల్కొన్న మహిళ ఒక్కసారిగా గట్టిగా అరిచింది. దీంతో ఉలిక్కిపడి లేచిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు వచ్చి చూసేసరికి ఓ వ్యక్తి పరుగులు పెడుతూ కనిపించాడు. దీంతో ఇంట్లో ఉన్న వ్యక్తులు పరుగెడుతున్న వ్యక్తి వెనకాలనే వెళ్లారు. 

అప్పటికే మరో దొంగ అలాగే చీకట్లో ఇంట్లోనే ఉన్నాడు. పరుగెత్తిన వ్యక్తులను గమనించిన మరో దొంగ ఇంట్లో నుండి ఆడవారి నుండి తప్పించుకొని మరోవైపు వెళ్ళాడు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఈ దుండగులు తప్పకుండా తమ ఇంట్లో దొంగతనానికి పాల్పడడానికి వచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు ఓ దొంగను పట్టుకున్న కుటుంబ సభ్యులు అక్కడే కట్టిపడేశారు. ఇరుగుపొరుగు వారిని పిలిచి దేహ శుద్ధి చేయడంతో దూరం నుంచి గమనిస్తున్న మరో వ్యక్తి చేసేదేమీ లేక ఘటనా స్థలానికి చేరుకొని వారికి సరెండర్ అయ్యాడు. 

దీంతో ఎక్కడి వారు వివరాలు తెలపాలని అడగడంతో వర్ధన్నపేట ఓ కుటుంబానికి బంధువులమే అంటూ సమాధానం చెప్పడంతో ఆ వ్యక్తులకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి పిలిపించారు. వచ్చిన వ్యక్తులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని రేపు ఉదయం మాట్లాడతామని తీసుకొని వెళ్లారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఈతంగమంతా జరిగిన పోలీసులు మాత్రం సంఘటనా స్థలానికి రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దొంగతనం జరిగిన వెంటనే 100 డయల్ చేసిన వ్యక్తుల ఇంటికి లొకేషన్ తెలుసుకొని పోలీసులు తమ పెట్రోలింగ్ వెహికల్ తో రావాల్సి ఉంటుంది. 

కానీ ప్రస్తుతం ఇప్పటివరకు కూడా పోలీసులు ఘటనా స్థలానికి రాకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. తిరిగి బాధితులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తారా సెటిల్మెంట్ చేసుకుంటారా అంటూ ఫోన్లో ప్రశ్నిస్తున్నట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. వరుస దొంగతనాలతో వర్ధన్నపేటలో భయాందోళనకు గురవుతున్న సమయంలో పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793