-->

మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి

 

మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి

న్యూ ఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. 

ఢిల్లీలోని శక్తి స్థల్‌లో ఉన్న ఇందిరా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్‌ తన నానమ్మతో ఉన్న అపురూప ఫొటోలను ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. తన గ్రాండ్‌మా ధైర్యం, ప్రేమ రెండింటికీ ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. 

ఆమె నుంచి ఎన్నో నేర్చుకున్నట్లు ఆమెతో ఉన్న జ్ఞాపకాలే తన బలం అని.. ఎల్లప్పుడూ అవే తనకు మార్గం చూపుతా యంటూ రాహుల్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793