-->

గనులలో అనుమతించబడిన పేలుడు పదార్థాల వినియోగంపై అవగాహన సదస్సు

గనులలో అనుమతించబడిన పేలుడు పదార్థాల వినియోగంపై అవగాహన సదస్సు


సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆర్.సి.ఓ.ఎ క్లబ్ నందు సోమవారం నాడు "గనులలో అనుమతించబడిన పేలుడు పదార్థాల వినియోగం పై అవగాహన సదస్సు"  ఉమేష్ ఏం సావర్కర్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ సౌత్ సెంట్రల్ జోన్ సనత్ కుమార్, DDMS మరియు  కమలేష్ కుమార్ వర్మ, DDMS ఆధ్వర్యంలో మరియు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు అధ్యక్షతన కొత్తగూడెం ఏరియా అధికారులకు మరియు సుపర్వైజర్లకు ఈ అవగాహన సదస్సు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి మరియు విశిష్ట అతిథులచే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బొగ్గు గనులలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోయిన ఉద్యోగులకు 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే అందరితో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమ ముఖ్య అతిథి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉమేష్ ఏం సావర్కర్ మాట్లాడుతూ... అనుమతించబడిన పేలుడు పదార్థాలు మరియు డిటోనేటర్ల నాణ్యత, భద్రత మరియు పని తీరు లక్షణాలకు అనుకూలంగా ఉన్నట్లు నిర్దారించుకున్న తరువాతనే పేలుడు పదార్థాలను ఉపయోగించుకోవాలని సూచనలు చేశారు. బ్లాస్టింగ్ సమయంలో రక్షణ సూత్రాలు పాటిస్తూ ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బ్లాస్టింగ్  విధులు నిర్వహించు ఉద్యోగులు సిస్టమాటిక్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) తప్పకుండా పాటించవలసినదిగా కోరడమైనది. బ్లాస్టింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ కార్మికులకు సరియైన శిక్షణ ఇవ్వవలసినదిగా కోరడమైనది. బ్లాస్టింగ్ నిర్వాహణలో సూపర్వైజర్ పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. బ్లాస్టింగ్ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా తగు నివారణ చర్యలు తీసుకోవలసిందిగా సూచనలు చేయడం జరిగింది. 

అనంతరం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్  ఎం.షాలేం రాజు మాట్లాడుతూ సింగరేణి నందు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వారిచే ఆమోదించబడిన పేలుడు పదార్థాలు మరియు డిటోనేటర్లను బొగ్గు బ్లాస్టింగ్ చేయడం కొరకు ఉపయోగించడం జరుగుతుంది. ఉత్పత్తి ఉత్పాదకతతో పాటు రక్షణ పట్ల పని ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రమాదరహిత ఉత్పత్తి కొరకు పటిష్టంగా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.  తద్వారా కొత్తగూడెం ఏరియా లో ప్రమాదములను పూర్తిగా నివారించడం జరుగుతుంది. 

యాజమాన్యము అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ వ్యక్తిగతంగా గాని, భౌగోళికంగా గాని, ఏదైనా ప్రమాదం జరిగే సూచనలు ఉంటే దానిని ముందుగానే పసిగట్టి అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో పనిచేసే వర్క్ ఇన్స్పెక్టర్లు మరియు సూపర్వైజర్ల పై ఎంతో బాధ్యత ఉంటుంది కాబట్టి వారు పనిప్రదేశాలలో పనిచేసే కార్మికులకు ఎప్పటికప్పుడు రక్షణ  పాటించవలసిన ఆవశ్యకతపై తగు సూచనలు చేస్తూ ఉండాలని జిఎం షాలేం రాజు  సూచించారు.

అనంతరం ఏఐటియుసి యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ వి మల్లికార్జున రావు గారు మరియు ఐ‌ఎన్‌టి‌యూ‌సి యూనియన్ నాయకులు ఎండి.రజాక్ మాట్లాడుతూ ఉత్పత్తి ఉత్పాదకతతో పాటు కార్మికుల రక్షణ, సంక్షేమం, ఆరోగ్యం పట్ల ఏరియాలో అనేక కార్యక్రమాలు కొనసాగుతూ ఉండటం సంతోషకరము. యూనియన్ ప్రతినిధులమైన మా సూచనలను పరిగణలోకి తీసుకొని సత్వర పరిష్కారాలు ఏరియా జిఎం చర్యలు చెబడుతున్నారు. కాబట్టి  ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణ మరియు పారిశ్రామిక ప్రశాంతతతో తన ప్రత్యేకతను చాటుకోవడం ఎంతో సంతోషదాయకం అని ప్రశంసించారు.

CMOAI బ్రాంచ్ సెక్రటరీ కొత్తగూడెం ఏరియా ఏ ఉపేందర్ బాబు మాట్లాడుతూ సింగరేణిలో రక్షణ చర్యలు తీసుకోవడం ఎంతో అభినందనీయమని తెలియజేశారు. 

ఈ సందర్భంగా  ఏరియా రక్షణ అధికారి ఎం వెంకటేశ్వర రావు గారిచే పేలుడు పదార్థాల వినియోగంపై  మరియు వాటి ప్రమాదాల నివారణ కొరకు తీసుకుంటున్న రక్షణ చర్యలు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కే. జీ తివారి జిఎం సేఫ్టీ కొత్తగూడెం రీజియన్, ఎస్ఓటు జిఎం జీవీ కోటిరెడ్డి, ఇంచార్జ్ ఏరియా ఇంజనీర్ సూర్యనారాయణ రాజు, ఏజెంట్ బి రవీందర్,  పి‌ఓలు – శ్రీ రమేష్, ప్రహ్లాద్, ఏరియా రక్షణ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డీజీఎం (పర్సనల్) బి శివ కేశవరావు, ఏరియా సెక్యూరిటీ అధికారి వి.శ్రీనివాస్ అన్ని గనుల మేనేజర్లు, సేఫ్టీ అధికారులు తదితర ఉన్నత అధికారులు,  అధికారులు, సుపర్వైజర్లు, ఆఫ్ లోడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793