-->

శంషాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హ్యాష్ ఆయిల్ ముఠా అరెస్ట్

శంషాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హ్యాష్ ఆయిల్ ముఠా అరెస్ట్

శంషాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హ్యాష్ ఆయిల్ ముఠా అరెస్ట్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు యువకుల్ని, వారి లగేజీలను తనిఖీ చేయగా..

చాక్లెట్ల ద్వారా హైడ్రోఫోలిక్ వీడ్ ను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 7.096కిలోల హైడ్రోఫోలిక్ వీడ్ ను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ అధికారులు అరెస్ట్ చేసి, ఇద్దరిపై ఎన్టీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు బాలానగర్ లో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సుమన్, లాలు, విజయ్ కుమార్ ల నుంచి 2.6 లీటర్ల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.13.50 లక్షలు ఉంటుందని తెలిపారు.

Blogger ఆధారితం.