పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు!
పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు!
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీనియర్ నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. ఆయనపై హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. పొంగులేటి అన్ని విషయాల్లో కలగజేసుకుని పార్టీకి ఇబ్బందిగా మారాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆయనను కంట్రోల్ చేయకుంటే పార్టీకి ఇబ్బంది తప్పదని వారు హైకమాండ్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల దీపావళికి ముందు రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ పొంగులేటి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఎవరైనా అరెస్ట్ కావొచ్చంటూ హింట్ ఇచ్చారు. దీంతో మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఏం జరగబోతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
కానీ.. దీపావళి ముగిసినా అలాంటిదేమీ జరగలేదు. అయితే.. ఇది పొంగులేటి సొంత కామెంట్స్ అని పార్టీకి సంబంధమే లేదన్న చర్చ గాంధీభవన్ వర్గాల్లో సాగుతోంది. పార్టీ, ప్రభుత్వంలో ఎలాంటి చర్చ చేయకుండా ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇంకా ప్రభుత్వంలోనూ తాను నంబర్. 2 అనేలా పొంగులేటి వ్యవహరిస్తున్నాడని సీనియర్ నేతలు పొంగులేటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టులన్నీ ఆయన సొంత కంపెనీకే వెళ్లడం సరికాదన్న అభిప్రాయం సైతం వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

Post a Comment