పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట మహిళ దుర్మరణం, బాలుడి పరిస్థితి విషమం
దిల్‌షుఖ్ నగర్ నివాసి రేవతి (39) తన కుటుంబంతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 mm థియేటర్‌లో పుష్ప ప్రీమియర్ షో చూడటానికి వెళ్లారు. అదే సమయంలో అల్లు అర్జున్ థియేటర్‌కు రావడంతో అభిమానులు భారీగా గేటు దగ్గరకు చేరుకున్నారు.
ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి మరియు ఆమె కొడుకు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెంటనే వారిని విద్యా నగర్‌లోని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్‌కు తరలించారు.
హాస్పిటల్‌కు చేరుకునే లోపే రేవతి మృతి చెందింది. శ్రీ తేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. రేవతి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.
ఈ ఘటన అభిమానుల అజాగ్రత్త కారణంగా చోటు చేసుకోవడంతో బాధాకరమైన వాతావరణం ఏర్పడింది.

Post a Comment