పివికే 5 ఇంక్లైన్ గనిలో మల్టీ డిపార్ట్మెంట్ టీం సభ్యుల సమావేశం
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలేం రాజు ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలోని పివికే5 ఇంక్లైన్ నందు మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశంను నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్టీ డిపార్ట్మెంట్ టీం సభ్యులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం ఆదేశానుసారం సింగరేణి సంస్థలోని ఉద్యోగులందరూ నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ వినియోగదారులకు అందించేందుకు గాను ప్రతి ఒక్కరు మనకు నిర్దేశించిన లక్ష్యాన్ని రక్షణతో సమైఖ్యంగా, సమర్దవంతంగా, సక్రమంగా, నిజాయితీతో నిర్వహిస్తూ సంస్థ అభివృద్దికి కృషి చేయాలనే దృక్పదంతో మొత్తం 11 ఏరియాలలో మల్టీ డిపార్ట్మెంట్ టీమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో బాగంగా కొత్తగూడెం ఏరియాలోని పివికే.5 ఇంక్లైన్ నందు మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశంను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేయడం జరిగింది.
మరి ముఖ్యంగా పివికే.5ఇంక్లైన్ నందు అత్యధిక గైర్హాజరు ఉంటుందని అందువలన గనికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడంలో వెనుకంజలో ఉందని అందువలన గైర్హాజరు శాతాన్ని తగ్గించి ఉత్పత్తిని పెంచాలని తెలియజేయడం జరిగింది అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో గనిలో ఎటువంటి సీరియస్ యాక్సిడెంట్ లేకుండా ఉత్పత్తి సాధించినందుకు గని ఉద్యోగులందరకి మల్టీ కమిటీ టీం సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏజెంట్, పివికే.5 ఇంక్లైన్ గారు మాట్లాడుతూ మన సంస్థ, మన గని మన బాధ్యతలను వివరించే ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా మన సంస్థ యొక్క స్థితిగతులను తెలుసుకొనుటకు ఎంతగానో ఉపయోగపడుతుందని అలాగే ప్రతి ఒక్కరూ అంకితభావంతో సమిష్టి కృషితో నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచుదాం మరియు సంస్థను ముందుకు తీసుకుపోదాం అని తెలియజేయడం జరిగింది.
అనంతరం డిజిఎం(ఐఈడి) ఎన్.యోహాన్ మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం యొక్క ఉద్దేశమును అనగా సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత, మిషనరీ పనితనం, ఉత్పత్తి వ్యయం మరియు ఉద్యోగుల సంక్షేమ కొరకు సింగరేణి సంస్థ తీసుకుంటున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హాజరైన ఉద్యోగులందరికీ వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎజిఎం (ఫైనాన్స్) కే. హనా సుమలత, డిజిఎం(ఐఈడి) ఎన్.యోహాన్, డిజిఎం (పర్సనల్), బి.శివ కేశవరావు, పివికే.5ఇంక్లైన్ ఏజెంట్ బి. రవీందర్, మేనేజర్ శ్యాం ప్రసాద్, ఎస్.ఈ (ఐఈడి). కే.ఆర్.నాగభూషణం, గని రక్షణ అధికారి వై.వి.ఎస్.కే కిషోర్ బాబు, సంక్షేమ అధికారి గోవర్ధన హరీష్, ఇతర ఉద్యోగులు, సూపర్వైజర్లు మరియు అధికారులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.

Post a Comment