అంబేద్కర్ భవన్ లో ఘనంగా నిర్వహించిన 68వ అంబేద్కర్ వర్ధంతి
68వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పట్టణంలో మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్.కె. సాబీర్ పాషా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సాబీర్ పాషా మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచన విధానం ప్రపంచానికి, భారతదేశానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాజ్యాంగంలో సెక్యులరిజాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. అంబేద్కర్ మరణం ద్వారా భారతదేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీరని లోటు కలిగిందన్నారు.
కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు, సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా సాబీర్ పాషాను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న, జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బరిగెల భూపేష్ కుమార్, జిల్లా నాయకులు మాటేటి గోపాల్, మాతాంగి లింగయ్య, గంటాడి కోటేశ్వరరావు, కూరగాయల శ్రీనివాస్, కొత్తూరు మదనయ్య, కంపెల్లీ దుర్గయ్య, చెనిగారపు కుమారస్వామి, సిద్ధల రవి, కొత్తూరు చుక్కయ్య, మాటేటి అంజయ్య, చాట్ల రామారావు, కొత్తూరు రవి, గొర్రె బాబురావు, మద్దికుంట గణేష్, ఇల్లందుల పోచయ్య, ఆవులూరి చంద్రయ్య, జంగం కృష్ణ, పెరిక కిరణ్, నమిల్ల మధు, కె నర్సయ్య, నమిల్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment