సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు
పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసిన నేత సోనియా గాంధీ
టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
కొత్తగూడెం కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పని చేసిన మహానేత సోనియాగాంధీ అని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. కొత్తగూడెంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవిప్రసన్న, కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, డాక్టర్ శంకర్ నాయక్ లతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం నాగా సీతారాములు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించి రాష్ట్రం ఏర్పాటుచేసిన ఘనత ఆమెదని అన్నారు.
తెలంగాణ ప్రజలు ఆమెకు ఎప్పుడు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేని సమయంలో కూడ తెలంగాణ ప్రజల గురించి అలోచించి, ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన సోనియా గాంధీ జీవితకాలం ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడ్డ కార్యకర్తలను అధిష్టానం తప్పక గుర్తిస్తుందని, పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చిన వారిని కూడ కలుపుకొని వెళ్లి అందరూ తమ పాత ఆలోచన విధానాన్ని వదిలేసి కాంగ్రెస్ విధానాలను పుణికి పుచ్చుకుని, ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలనీ కార్యకర్తలకు, కాంగ్రెస్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment