సేవలోనే సంతోషాలు విద్యాశాఖ అధికారి బానోత్ బాలాజీ
చుంచుపల్లి మండల విద్యాశాఖ అధికారి బానోత్ బాలాజీ పేర్కొన్నారు, "సాటి మనిషి సేవలోనే మన సుఖసంతోషాలు దాగి ఉన్నాయి." చుంచుపల్లి మండలం రుద్రం పూర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల కోసం సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తూ, వారికి జమాతే ఇస్లామి హింద్ శాఖ ఆధ్వర్యంలో నెల రోజుల సరిపడా అల్పాహారం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద విద్యార్థుల కోసం జమాతే ఇస్లామి హింద్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు.
సంస్థ అధ్యక్షుడు షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, మానవాళి మార్గదర్శి ఖురాన్ 'ఇఖ్రా' అనే చదువు పాఠంతో ప్రారంభమైందని, జ్ఞానం ఆర్జించడంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం మానకూడదని ప్రవక్త ముహమ్మద్ వివరించారు. అందుకే జమాత్ కులమతాలకు అతీతంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తుంది అని చెప్పారు.
ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి సర్వేశ్వరరావు అల్పాహారానికి సహాయం అందించగా, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక విద్యార్థికి ఆర్థిక సహాయం చేశారు.
ఈ కార్యక్రమంలో జమాత్ సభ్యులు ముమ్మద్ షమీం, రభ్భానీ, ఉపాధ్యాయులు గణేష్, లక్ష్మీ, రాధ, రాజకీయ నాయకులు సుల్తాన వెంకటేశ్వరరావు, ఇంద్రా దేవి, దీరజ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment