-->

భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు

భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు


మాజీ ప్రధాన మంత్రి వర్యులు భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 25న యావత్ దేశం సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BJP కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచాలకు వెలుగు చూపిన వ్యక్తి దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన మహా మేధావి, కార్య దక్షుడు,అనేక రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు కొదవ సింహం పాండురంగాచార్యులు, జిల్లా ధార్మిక సెల్ అధ్యక్షుడు గుమలాపురం సత్యనారాయణ, ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సాయి కిరణ్, చుంచుపల్లి మండల అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు మరియు కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్ యాదవ్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793