-->

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు

 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు

*మరో రెండు రోజుల్లో 593 మందికి సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత.

సింగరేణి సంస్థలో ఇటీవల కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఎంపికైన 593 మందికి నియామక పత్రాలను సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా అందించనున్నారు.

 డిసెంబరు 4న పెద్దపల్లిలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల సభలో ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారని సింగరేణి సీఎండీ బలరాం ఓ ప్రకటనలో తెలిపారు. విజయోత్సవాల నిర్వహణపై ఆయన తాజాగా సమీక్ష నిర్వహించారు. విజయోత్సవాల్లో భాగంగా సింగరేణిలో కూడా కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతో సింగరేణిలో ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793