భట్టి నందిని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
కొత్తగూడెం పట్టణములో ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అందరూ ప్రేమగా పిలిచే అమ్మ తలైవి నందినమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినారు. స్థానిక ముత్తాబాయి మెమోరియల్ మరియు శ్రీ జ్యోతి అనాధ వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రమం నందు అన్నదానం, ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రజాక్, కొత్తగూడెం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు ఎం.డి. గౌస్, మాజీ కౌన్సిలర్ కాసుల వెంకట్, సామంతుల సత్యనారాయణ జిల్లా నాయకులు మాదా శ్రీరాములు, కౌన్సిలర్ పల్లపు లక్ష్మణ్, మహిళా నాయకురాలు గాయత్రి ప్రసంగిస్తూ మల్లు నందిని 1993లో పొలిటికల్ సైన్స్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టభద్రురాలైంది.1995లో భట్టి విక్రమార్కతో పెళ్లయ్యాక మధిరకు వెళ్లారు. ఆమె స్థానిక పార్టీ నాయకులతో మరియు క్యాడర్‌తో ఎప్పుడు టచ్‌లో వుంటారు. ఆమెకు ప్రతి గ్రామంలోని ప్రతి కార్యకర్త మరియు నాయకుడు తెలుసు. వారి సమస్యల గురించి తెలుసుకుంటారు, చేయగలిగిన సహాయం చేస్తారన్నారు.
మల్లు బట్టి నందిని 2007 సంవత్సరంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలందు బట్టి విక్రమార్క గెలుపుకు కీలక పాత్ర పోషించినరని ఆరోజు నుండి ఈరోజు వరకు నియోజకవర్గ ప్రజలను రాష్ట్ర ప్రజల ఆదర అభిమానాలు పొందినారని అందర్నీ ఆప్యాయంగా కార్యకర్తలను తన బిడ్డల వల్లే ఆప్యాయంగా చూస్తారని కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అని చెప్పే పెద్ద మానవతావాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సామంతుల శంకర్, రహిమాన్, బీరా రాము తదితరులు పాల్గొన్నారు.

Post a Comment