-->

మహాపడి పూజలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

 

మహాపడి పూజలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

కాంపెల్లి శ్రీను స్వామి, బానోత్ చందులాల్ స్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు 

కొత్తగూడెం స్వామియే శరణమయ్యప్ప.. హరి హరి వాసనే శరణమయ్యప్ప అంటూ వేలాదిమంది అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో చుంచుపల్లి మండలం గౌతంపూర్ కాంపెల్లి శ్రీను స్వామి, బానోత్ చందులాల్ స్వామి ఆద్వర్యంలో జరిగిన ఏర్పాటు చేసిన మహాపడిపూజ ప్రాంగణం మార్మోగింది. దుర్గాదేవి ఆలయ ఆవరణంలో ప్రత్యేకమైన మండపం ఏర్పాటు చేసి.. సర్వంగా సుందరంగా రంగురంగుల పువ్వులతో అలంకరించారు. ముందుగా శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం, నిర్వహించారు. 

కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అయ్యప్ప స్వామి 18వ మహా పడిపూజ సందర్భంగా 18 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, 18 కలశాలతో నిర్వహించిన పూజలో పాల్గొన్నారు. 

స్వాముల భజన పాటలతో అక్కడి ప్రాంగణం స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. అయ్యప్ప స్వాములు నిర్వహించిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ మహా పడిపూజలో రాంబాబు గురుస్వామి, రామనాధం గురుస్వామి అయ్యప్ప కీర్తనలతో అలరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793