ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన అనసూర్య అరెస్ట్
ములుగు: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన అనసూర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 2వ తేదీన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
పోలీసుల దర్యాప్తులో, సూర్యాపేట జిల్లా దూద్వాతండాకు చెందిన బానోత్ అనసూర్య (29) ఈ ఘటనకు కారణమని నిర్ధారించారు. అనసూర్యపై ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడం వల్ల హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు స్పష్టం చేశారు.
అన్ని ఆధారాలు సేకరించి, అనసూర్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సమాచారం. హరీష్ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

Post a Comment