TRVKS, AITUC యూనియన్ నాయకులు ఎమ్మెల్యే కూనంనేని కి వినతి పత్రం అందజేశారు
హైదరాబాద్ నగరంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసన సభ్యులు, CPI పార్టీ ఫ్లోర్ లీడర్ కూనంనేని సాంబశివరావుని TRVKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్, AITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల సుధాకర్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలపై వినతి పత్రం అందజేశారు.
ముఖ్యంగా, 1999 నుంచి 2004 మధ్య నియమించబడిన విద్యుత్ ఉద్యోగులకు EPF స్థానంలో GPF వర్తింపచేయాలన్న డిమాండ్‌తోపాటు, ఆర్టిజన్స్ గ్రేడ్ చేంజ్/కన్వర్షన్, సీనియర్ ఫోర్ మెన్ పోస్టుల మంజూరి, ఉద్యోగులపై పని భారం తగ్గించేందుకు అదనపు పోస్టుల మంజూరి, 2013లో TG GENCOలో JPAల రిక్రూట్‌మెంట్ సందర్భంలో మెర్జ్ చేసిన క్యాడర్ల పోస్టులను శాంక్షన్ చేయాలని కోరారు.
ఈ సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి, విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్స్‌కు తగు న్యాయం చేయాలనే అభ్యర్థన చేశారు.
ఈ కార్యక్రమంలో TRVKS రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు SPDCL కంపెనీ కార్యదర్శి P కరెంట్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాసురి శ్రీనివాస్, SPDCL కంపెనీ అధ్యక్షులు MD యూసుఫ్, TRANSCO కంపెనీ కార్యదర్శి P రాములు, SPDCL కంపెనీ నాయకులు విశాల్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment