-->

TRVKS రెండు రీజియన్స్ కార్యవర్గ సమావేశం

 

TRVKS రెండు రీజియన్స్ కార్యవర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం H-58 (TRVKS) రికగ్నైజ్డ్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (TRVKS) ఆధ్వర్యంలో కేటీపీఎస్ రీజనల్ కార్యాలయంలో రెండు రీజియన్స్ కార్యవర్గ సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీపీఎస్‌లోని రెండు కాంప్లెక్సుల్లో కార్మికులు మరియు ఆర్టిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.

 కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు విద్యుత్ ఉద్యోగుల మరియు ఆర్టిజన్ల సమస్యలపై TG TRANSCO అధికారులకు లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో, TRVKS సభ్యులు MLA కి కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కోసం MLA ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారాలను సాధించాలని చారుగుండ్ల రమేష్ సూచించారు.

అదేవిధంగా, కేటీపీఎస్ 5 & 6 దశలలో విధి నిర్వహణ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగి మేదర రమేష్ మృతికి సంఘం సంతాపం ప్రకటించింది. అలాగే, వారి కుటుంబానికి సంఘం సానుభూతి తెలియజేసింది.

ఈ సమావేశంలో రాష్ట్ర, జెన్కో, రీజినల్, బ్రాంచ్, మరియు ఆర్టిజన్ నాయకులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793