-->

మహిళ టీచర్లకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సితక్క

మహిళ టీచర్లకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సితక్క

కోట్లాది మందికి విద్యను అందించిన సావిత్రిబాయి ఫూలేను అధికారికంగా టీచర్స్ డేగా నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమని మంత్రి సీతక్క అన్నారు.

ఈ సందర్భంగా అన్ని టీచర్లకు, ముఖ్యంగా మహిళా టీచర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మహిళా టీచర్స్ డేను అధికారికంగా నిర్వహించాలని దళిత, బడుగు బలహీన వర్గాల మహిళలు డిమాండ్ చేస్తూ వచ్చారు.

తెలంగాణ ఉద్యమంతో సాధించుకున్న అనేక విజయాలలో, సావిత్రిబాయి ఫూలే వంటి మహనీయుల సేవలకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.

గొప్ప కవులు, మేధావులైన జయరాజు త్యాగాన్ని గుర్తించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిన చొరవ ప్రశంసనీయమని ఆమె అన్నారు. అలాగే, తెలంగాణ ఉద్యమ నాయకుడైన గద్దర్‌కు గుర్తింపు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

సావిత్రిబాయి ఫూలే జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలని, వారి కష్టాన్ని, త్యాగాన్ని స్మరించుకోవడం ద్వారా మహిళా సాధికారతకు మార్గం చూపాలని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793