-->

పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు

పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు

ఈ నెల 26న ముగియనున్న మున్సిపాలిటీల టర్మ్

కొత్తగా 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల ఏర్పాటు

డివిజన్లు, ఓటర్ల లిస్టుపై అధికారుల కసరత్తు

శివారు పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం

హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో పాటు లేదా కొద్ది రోజుల గ్యాప్‌లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 26తో మున్సిపాలిటీల టర్మ్ ముగియనుంది. సంక్రాంతి పండుగ అనంతరం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, ఈ నెల చివరి వారంలో నుంచి ఫిబ్రవరి మొదటి వారంలోగా మూడుదశల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం పెండింగ్లో ఉండడం వల్ల పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికలకు ఈ సమస్య ఉండకపోవడంతో, పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

నేడో రేపో గెజిట్

ప్రస్తుతం రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వీటికి సంబంధించిన గెజిట్ నేడో లేదా రేపో విడుదల కానుంది.

129 మున్సిపాలిటీల పదవీకాలం ఈ నెల 26తో ముగియనుంది. మిగిలిన కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం ఈ ఏడాది మేలో ముగుస్తుంది. జీహెచ్ఎంసీ టర్మ్ వచ్చే ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

మార్పులు చేర్పులు

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు సంబంధించి అధికారులు జనాభా, ఓటర్ల ప్రకారం డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 58 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేసి, వార్డుల విభజన కొనసాగుతోంది.

కొలిక్కి రానున్న రిజర్వేషన్లు

లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ పూర్తికావొస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందించగానే, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే విడుదల కావచ్చు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793