-->

మహిళా టీచర్స్ డే గా ప్రభుత్వం ప్రకటించటం సంతోషం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి.

మహిళా టీచర్స్ డేగా ప్రభుత్వం ప్రకటించటం సంతోషం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి.

సావిత్రిబాయి పూలే జయంతి రోజున మహిళా టీచర్స్ డేగా ప్రకటించటం సంతోషకరం: మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి.

ప్రతి సంవత్సరం జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని 2025లో ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు.

"ఒక మహిళగా సావిత్రిబాయి పూలే సేవలు, త్యాగం, మహిళా సాధికారతకు ఆమె చేసిన కృషి అనన్యమైందని నేను గర్వంగా భావిస్తున్నాను," అని ఆమె అన్నారు.

సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలే కలలను నెరవేర్చేందుకు అద్భుతమైన పోరాటం సాగించి, 1831-1897 మొదటి మహిళ ఉపాధ్యాయురాలిగా మారి మహిళా విద్య కోసం విశేష కృషి చేశారు. 1848లో పుణేలో  బాలికల కోసం తొలి పాఠశాలను స్థాపించారు. కుల వివక్షతను తొలగించేందుకు పనిచేశారు. బాలవితంతువుల కోసం శరణాలయాన్ని స్థాపించి వారికి ఆశ్రయం, విద్యా అవకాశాలు కల్పించారు.

ఆమె విశిష్టమైన కృషికి గుర్తింపుగా ప్రజా ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించటం ప్రశంసనీయమని కాపు సీతాలక్ష్మి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బాబుక్యాంప్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నీరజ మరియు ఇంచార్జ్ కుంటి రమాదేవిని ప్రత్యేకంగా సన్మానించారు.

ప్రభుత్వానికి విజ్ఞప్తి:

మహిళల అభ్యున్నతికి మాత్రమే కాకుండా, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ సూచించారు. "ఇలాంటివి సావిత్రిబాయి ఆశయాలకు నిజమైన నివాళి అవుతుంది," అని ఆమె అభిప్రాయపడ్డారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793