దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, FDC ఛైర్మన్ దిల్ రాజుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం సినిమాలను వాడుకోవద్దన్న దిల్ రాజు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
"దిల్ రాజు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది," అంటూ నేతలు విమర్శించారు. "మాజీ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు దిల్ రాజు ఎందుకు స్పందించలేదని" ప్రశ్నించారు.
అంతేకాక, "అతను దిల్ రాజు కాదు, డీల్ రాజు," అంటూ బీఆర్ఎస్ నేతలు క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ నేతల ఈ విరుచుకుపడటం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతున్నది.

Post a Comment