-->

సావిత్రిబాయి పూలే జయంతి ఘన నివాళులు సీఎం రేవంత్ రెడ్డి

సావిత్రిబాయి పూలే జయంతి ఘన నివాళులు సీఎం రేవంత్ రెడ్డి

మహిళల అభ్యున్నతికి మార్గదర్శి, కుల వివక్ష, పితృస్వామిక పీడలపై పోరాడిన వీరనారి సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.

ముఖ్యమంత్రి సందేశం:

♦️ సావిత్రిబాయి పూలే మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచారని, సమానత్వం కోసం చేసిన పోరాటం చారిత్రాత్మకమని సీఎం అన్నారు. పూలె దంపతుల త్యాగాలను, సేవలను గుర్తు చేసుకుంటూ, వారి ఆశయాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.

♦️ మహిళల సాధికారత, ఆడబిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

♦️ సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకునే సందర్భంలో మహిళా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

స్మారక దినోత్సవ ఆవశ్యకత:

♦️ మహిళా ఉపాధ్యాయుల సహకారంతో ప్రతి ఏడాది ఆమె జయంతిని ఘనంగా నిర్వహించాలని సీఎం పిలుపునిచ్చారు.

♦️ సావిత్రిబాయి ఆశయాలు నేటితరం మహిళలకు స్ఫూర్తి కలిగిస్తాయని, సమాజం కోసం ఆమె చూపించిన మార్గం మార్పుకు నాంది అని పేర్కొన్నారు.

సమాజ చైతన్యానికి సావిత్రిబాయి పూలే చూపిన దారిలో ప్రభుత్వం నడుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793