సమాన పనికి సమాన వేతనం నిబంధన రాష్ట్రంలో అమలు చేయాలి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి
తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ అనుబంధం) రాష్ట్ర రెండవ మహాసభ ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పేరాల కట్టయ్య భవన్‌లో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరై ప్రసంగించారు.
గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో సుమారు 60 వేల మంది కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారన్నారు. పట్టణాలను శుభ్రంగా ఉంచే ఈ కార్మికులు సరైన పారితోషికం పొందడం లేదని, భారత అత్యున్నత న్యాయస్థానం 2016లో ఇచ్చిన "సమాన పనికి సమాన వేతనం" నిబంధన రాష్ట్రంలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనంగా ₹26,000 చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి డిమాండ్లు
- కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ స్థాయి హోదా కల్పించడం.
- పెరిగిన పిఆర్సి ప్రకారం వేతనాలు చెల్లించడం.
- కార్మికులకు అవసరమైన భద్రతా పరికరాలు, సౌకర్యాలు అందించడం.
ఈ మహాసభలో టియుసిఐ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు జి రామయ్య, కొత్తపల్లి రవి, బిళ్ళకంటి సూర్యం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలు యాకుబ్ షావాలి, గోనెల రమేష్, పెడ్డబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment