-->

సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత

 

సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: మేడ్చల్‌లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హాస్టల్ సిబ్బంది విద్యార్థినీల అసభ్యకర వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థినీలు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు.

ఆందోళనలో విద్యార్థినుల డిమాండ్లు

వీడియోలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హామీ ఇచ్చేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థినీలు స్పష్టం చేశారు. ఈ ఘటనకు విద్యార్థి సంఘాలు బాసటగా నిలుస్తూ, నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

పోలీసుల నివేదిక

ఈ ఘటనపై ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, హాస్టల్ సిబ్బంది వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 11 సెల్ ఫోన్లలో అభ్యంతకరమైన వీడియోలు లేవని పేర్కొన్నారు. వీడియోలు రికార్డ్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.

ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది

ఈ ఉదయం మరోసారి విద్యార్థినులు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. కాలేజీ యాజమాన్యం సత్వర చర్యలు తీసుకుని నిందితులపై కఠిన శిక్షలు అమలు చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793