-->

పదో తరగతి పేపర్ లీక్: 11 మంది అరెస్ట్, ఆరుగురికి రిమాండ్


పదో తరగతి పేపర్ లీక్: 11 మంది అరెస్ట్, ఆరుగురికి రిమాండ్

నల్గొండలో పదో తరగతి పేపర్ లీక్: 11 మంది అరెస్ట్, ఆరుగురికి రిమాండ్

నల్గొండ, మార్చి 24: నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో పోలీసులు 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 21న నకిరేకల్ గురుకుల పాఠశాలలో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ కావడంతో కేసు నమోదైంది.

పోలీసులు విచారణలో పేపర్ లీక్ వ్యవహారంలో కీలక ఆధారాలను సేకరించి, ప్రధాన నిందితులను గుర్తించారు. అందులో చిట్ల ఆకాశ్ (A1), బండి శ్రీనివాస్ (A2), చిట్ల శివ (A3), గుడుగుంట్ల శంకర్ (A4), బ్రహ్మదేవర రవిశంకర్ (A5), మరియు ఓ మైనర్ బాలుడు (A6) ఉన్నారు.

ఈ ఆరుగురిని నకిరేకల్ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి వారి విచారణ తర్వాత రిమాండ్ విధించి జైలుకు పంపారు. మిగతా ఐదుగురిపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు, పోలీసు శాఖ సీరియస్‌గా వ్యవహరిస్తుండగా, మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు కలిగించే ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారుల స్పష్టం.

Blogger ఆధారితం.