-->

జమాఅతె ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ కిట్ల పంపిణీ

జమాఅతె ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ కిట్ల పంపిణీ


గోదావరిఖని: రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే పవిత్ర ఈదుల్ ఫితర్ పండుగను పురస్కరించుకుని, జమాఅతె ఇస్లామి హింద్ గోదావరిఖని శాఖ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు పండుగ కిట్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా లబ్దిదారులకు కింది నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు:
గోధుమ పిండి
చెక్కర
పాకెట్ నెయ్యి
సేమియా పాకెట్
బాదాం, కిస్మిస్, ఖర్జూర
ఖజూర్
పాలు
నగదు రూ.100/-

ఈ సందర్భంగా జమాఅతె ఇస్లామి హింద్ గోదావరిఖని శాఖ అధ్యక్షులు మెహ్రాజ్ అహ్మద్ మాట్లాడుతూ, భారతదేశంలో 75 సంవత్సరాలుగా సామాజిక సేవకు ప్రాధాన్యతనిస్తూ జమాఅతె ఇస్లామి హింద్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి చేయూత అందించేందుకు తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్వాజీ ముహమ్మద్ ఇస్మాయిల్ నిజామి (ఉపాధ్యక్షుడు), ముస్తఫా (కోశాధికారి), జావిద్ అక్మల్ హుస్సేనీ (మురబ్బి), అహ్మద్ పాషా (కౌన్సిలర్), అబ్దుల్ రజాక్, జుబైర్, ఖాజా మొయినుద్దీన్, సిరాజుద్దీన్, మక్సూద్ అహ్మద్ ఖాన్, మిన్హాజుద్దీన్, అక్రముద్దీన్, అమీర్, మునవ్వరుద్దీన్, అక్రమ్, వహీద్ ఖాన్, అంకుశావళి పాల్గొన్నారు.

మహిళల విభాగం నుంచి సబీరా నాజ్ (మహిళల అధ్యక్షురాలు), గౌహర్ అంజుమ్, మిన్హాజ్ అయ్యూబ్ (ఇంజనీర్) మరియు ఇతర సభ్యులు, కార్యకర్తలు పాల్గొని ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పేద ముస్లిం కుటుంబాలకు పండుగ సందర్భంలో సంతోషాన్ని పంచడం సాధ్యమైందని నిర్వాహకులు తెలిపారు.

Blogger ఆధారితం.