-->

కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గా మెండు రాజమల్లు నియామకం

 

కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గా మెండు రాజమల్లు నియామకం

కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గా మెండు రాజమల్లు నియామకం

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మెండు రాజమల్లు కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గా నియమితులయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ చేతుల మీదుగా ఆయన నియామక ఉత్తర్వులు స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగూడెం చీఫ్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ (ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి) బత్తుల రామారావుకు మెండు రాజమల్లు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గొల్లపూడి భానుమతి, రెండవ అదనపు జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కే సాయి శ్రీ, స్పెషల్ పబ్లిక్ ప్రొసీక్యూటర్ వెలగల నాగిరెడ్డి, సీనియర్ న్యాయవాదులు పలివెల సాంబశివరావు, రమేష్ కుమార్, సూరెడ్డి రమణారెడ్డి, గాదె సునంద, అడపాల పార్వతి, జీ.కే. అన్నపూర్ణ, పురోహితులు కొండవీటి దత్తాత్రేయ శర్మ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమం కొత్తగూడెం న్యాయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793